యాక్సిడెంట్ తర్వాత విరూపాక్షతో ఖతర్నాక్ రీఎంట్రీ ఇచ్చాడు సుప్రీం హీరో సాయిధర్మతేజ్ హిట్ సినిమా తరువాత కూడా విమర్శలు తప్పలేదు మరీ ముఖ్యంగా ఒక విషయంలో చాలా ట్రోల్స్ కి కూడా గురయ్యాడు సాయిధర్మతేజ్ ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి మరి అది ఎలా ఉందో చూద్దాం రండి.
మూడేళ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్ సాయిధర్మతేజ్ జీవితాన్ని మార్చేసింది ఆయన మళ్లీ సినిమాలు చేస్తాడా చేయడా దగ్గరనుండి విరూపాక్షతో బ్లాక్ బస్టర్ హిట్ వరకు ఈయన జర్నీ జరిగింది దీని తర్వాత వచ్చిన బ్రో అంతగా ఆడకపోయినా తేజ్ బ్రో తర్వాత కావాలని లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు తేజ్ దీనికి ప్రధాన కారణం ఆయనకు తన బాడీ మీద వస్తున్న విమర్శలు యాక్సిడెంట్ తర్వాత చాలా బరువు పెరిగిపోయాడు తేజ్ అందుకే అంతా టైం తీసుకొని సిక్స్ ప్యాక్ తో నెక్స్ట్ మూవీ లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు ఈ హీరో రోహిత్ అనే కొత్త దర్శకుడు తో 120 కోట్ల బడ్జెట్ తో భారీ పిరియాడికల్ మూవీ చేస్తున్నాడు ఈ మెగా మేనల్లుడు హనుమాన్ సినిమాలు నిర్మించి సూపర్ హిట్ కొట్టినటువంటి నిరంజన్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు సినిమా కూడా చాలా వేగంగా జరుగుతుంది 2025 ఆగస్టులో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్ర బృందం నవంబర్ 14న సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుంది దీనికి కారణం ఆ రోజుకి ఇండస్ట్రీకి వచ్చి10 సంవత్సరాలు అయింది అందుకే అ రోజు సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి గ్యాప్ తీసుకున్న భారీగానే ప్లాన్ చేస్తున్నాడు సాయిధర్మతేజ్
One thought on “Glimpses of Sai Dharam Tej’s birthday gift: సాయి ధరమ్ తేజ్ బర్త్ డే కానుకగా గ్లింప్స్”